- స్టూడెంట్లకు సీఎస్ఐఆర్ డీజీ కాలై సెల్వి సూచన
- అట్టహాసంగా ఐఐఐటీ హైదరాబాద్కాన్వకేషన్
గచ్చిబౌలి, వెలుగు : గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్(ఐఐఐటీహెచ్) 23వ కాన్వకేషన్ ప్రోగ్రామ్ శనివారం ఘనంగా జరిగింది. బ్రహ్మకుమారీస్ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కాన్వకేషన్వేడుకల్లో 600 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్పట్టాలు అందుకున్నారు. ఇందులో 32 మంది పీహెచ్ డీ, 224 మంది స్టూడెంట్స్ మాస్టర్స్‌లో పట్టాలు తీసుకున్నారు. ఒకేసారి 600 మంది పట్టాలు తీసుకోవడం ఐఐఐటీహెచ్ చరిత్రలో ఇదే మొదటసారని ఐఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే.నారాయణన్ వెల్లడించారు.
బీటెక్ఈసీఈ స్టూడెంట్మర్రమనేని జైష్ణవ్ బెస్ట్ స్టూడెంట్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. సీఎస్ఈ స్టూడెంట్హర్షవర్థన్ ఆల్ రౌండర్ కేటగిరీలో గోల్డ్‌మెడల్ అందుకున్నాడు. కార్యక్రమానికి సీఎస్‌ఆర్‌ఐ డెరెక్టర్ జనరల్‌గా నల్లతంబి కాలైసెల్వి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేట్స్టూడెంట్స్కు పట్టాలతోపాటు గోల్డ్మెడల్స్ఇచ్చారు. ఈ సందర్భంగా కాలైసెల్వి మాట్లాడుతూ..డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థులు దేశం గర్వించే క్షణాలను సృష్టించాలన్నారు.
విదేశాల్లో చదివి ఉద్యోగాలు చేసి ఎంత సంపాదించినా.. తిరిగి స్వదేశానికి వచ్చి సేవ చేయాలని సూచించారు. ఐఐఐటీహెచ్విద్యా విధానం ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. కార్యక్రమంలో ఐఐఐటీహెచ్గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.