
- 30 వ వార్షికోత్సవం సందర్భంగా వేడుకలు
-
హైదరాబాద్: హకీంపేట్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ఏఎఫ్ శిక్షణ కేంద్రంలో స్పెషల్ పరేడ్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి అజయ్ కుమర్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాల కవాతు ఆకట్టుకుంది. విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఆర్ఏఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ ను తిలకించేందుకు వివిధ పాఠశాలలు, కళాశాలల చిన్నారులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఢిల్లీ ఎర్రకోట మైదానంలో స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నిర్వహించే పరేడ్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆర్ఏఎప్ దళాలు విన్యాసాలు నిర్వహించాయి. సైనిక సంప్రదాయాలు, లాంఛనాలు స్ఫూర్తిదాయకంగా జరిగాయి.