
మేడ్చల్ జిల్లా హకీంపేట ఎన్ఎస్ఐఏ(నేషనల్ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ)లో ఆదివారం 54వ సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) రైజింగ్డే పరేడ్ ఘనంగా జరిగింది. మహిళా సిబ్బంది చేసిన కళరియపట్టు ఆకట్టుకుంది. టెర్రరిస్టులు దాడులు చేసిన టైంలో సీఐఎస్ఎఫ్సిబ్బంది ఎలా స్పందిస్తారో వివరిస్తూ చేసిన మాక్ డ్రిల్స్ ఆకట్టుకున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగిన టైంలో మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడడం, డ్రోన్లతో కెమికల్ ఫోమ్ చల్లడం, నీళ్లతో గాల్లో జాతీయ జెండా రంగులు వచ్చేలా చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి.