ఐటీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఎలాంటి సంక్షోభంలో ఉందో చెప్పటానికి ఈ ఒక్క స్టోరీ చాలు.. జస్ట్ ఏడు అంటే 7 నిమిషాల మీటింగ్.. ఏకంగా రెండు డిపార్ట్ మెంట్లలోని ఉద్యోగులను ఇంటికి పంపించింది కంపెనీ.. ఏకంగా 3 వేల 900 మంది ఉద్యోగులను రోడ్డున పడేసింది.. ఇదేదో అల్లాటప్పా కంపెనీ కాదు.. ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతున్న IBM.. అవును మీరు విన్నది నిజమే.. ఐబీఎం సాఫ్ట్ వేర్ కంపెనీ.. ఏడు నిమిషాల మీటింగ్ తర్వాత.. మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లోని ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక మాంధ్యం.. ఆయా డిపార్ట్ మెంట్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఐబీఎం కంపెనీ. ఇప్పుడు ఐటీ రంగంలో ఇదే సంచలనంగా మారింది.
కంపెనీ పని తీరుపై మీటింగ్ పెట్టారు చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జోనాథన్ అడాషేక్. ఏడు నిమిషాల మీటింగ్ తర్వాత.. ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీ నిబంధనల ప్రకారం అందరికీ సెటిల్ మెంట్ చేయటం జరుగుతుందని.. ఇందులో టైం ఫ్రేం ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. చీఫ్ ఆఫీసర్ ప్రకటనతో ఉద్యోగులు షాక్ అయ్యారు. మారుతున్న టెక్నాలజీ.. కంపెనీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారాయన.
లేఆఫ్స్ ఉంటాయని గతంలోనే ప్రకటించింది ఐబీఎం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోపాటు వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు కంపెనీ పనితీరును మార్చటం ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అప్పట్లోనే సంకేతాలు ఇచ్చారు. అది ఇప్పుడు అమలు చేశారు. ఐబీఎం ఉద్యోగుల సమాచారం ప్రకారం.. తీసేస్తున్న ఉద్యోగుల సంఖ్య 3 వేల 900గా ఉందనేది అంచనా. రాబోయే ఐదేళ్లలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 30 శాతం మందిని తీసేయబోతున్నట్లు కూడా స్పష్టం చేసింది కంపెనీ.
ALSO READ :- పాకిస్తాన్ నుంచి పాస్పోర్టు లేకుండా కెనడా వెళ్లింది..తర్వాత ఏం జరిగిందంటే..
2024 జనవరి ఒకటో తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా 204 ఐటీ కంపెనీలు.. మార్చి 15వ తేదీ వరకు 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ పరిణామాలు ఐటీ రంగంలోని అసాధారణ పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయంటున్నారు నిపుణులు.