ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్‌‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్‌‌

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అందరికంటే ముందుగా 11 మంది అభ్యర్థులతో  మొదటి జాబితాను ప్రకటించింది. లిస్టులో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇటీవల పార్టీలో జాయిన్ అయిన ఆరుగురికి చోటు దక్కింది. ఛతర్‌‌పూర్ నుంచి బ్రహ్మ సింగ్ తన్వార్ , కిరాడీ నుంచి అనిల్ ఝా, విశ్వాస్ నగర్‌‌ నుంచి దీపక్ సింగ్లా,  రోహతాస్ నగర్‌‌ నుంచి సరితా సింగ్, లక్ష్మీ నగర్‌‌ నుంచి బీబీ త్యాగి, బదర్‌‌పూర్‌‌ నుంచి రామ్‌‌సింగ్ నేతాజీ పోటీ చేయనున్నారు. అలాగే.. సీలంపూర్ నుంచి జుబేర్ చౌదరి, సీమాపురి నుంచి వీర్ సింగ్ ధింగన్,  ఘోండా నుంచి గౌరవ్ శర్మ, కరావాల్ నగర్ నుంచి మనోజ్ త్యాగి, మటియాలా నుంచి సోమేశ్ షౌకీన్ ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. వీరిలో  బ్రహ్మ సింగ్ తన్వార్, అనిల్ ఝా,  బీబీ త్యాగిలు ఇటీవల బీజేపీ నుంచి ఆప్​లో చేరారు.