మహిళను 59 ముక్కలుగా నరికిన యువకుడు సూసైడ్

మహిళను 59 ముక్కలుగా నరికిన యువకుడు సూసైడ్

బెంగుళూరు: దేశంలో సంచలనం సృష్టించిన మహాలక్ష్మి అనే మహిళ మర్డర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగుళూరులో మహాలక్ష్మీని అత్యంత దారుణంగా నరికి చంపిన నిందితుడు ముక్తి రంజన్ దాస్ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు బెంగుళూరు పోలీసులు నిర్ధారించారు. మహాలక్ష్మి హత్య అనంతరం నిందితుడు ముక్తి రంజన్ దాస్ పరారీలో ఉన్నాడు. దేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహాలక్ష్మీ మర్డర్‎ను సీరియస్‎గా తీసుకున్న బెంగుళూరు పోలీసులు నిందితుడి కోసం ముమ్మురంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు ముక్తి రంజన్ దాస్ ఒడిషాలో ఉన్నట్లు సమాచారం రావడంతో బెంగుళూరు పోలీసులు అక్కడికి వెళ్లిచూడగా.. అప్పటికే నిందితుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు  సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


అసలేం జరిగిందంటే..?

ముక్తి రంజన్ దాస్ అనే హంతకుడు, బాధితురాలు మహాలక్ష్మి బెంగుళూరులో ఒకే షాపింగ్ మాల్లో పనిచేసేవారు. ఇద్దరికీ 2023లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో నేరస్తుడు ఇంత కిరాతకంగా ఆమెను హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నేరస్తుడి సోదరుడితో పాటు మరో ఇద్దరిని బెంగళూరు పోలీసులు ఇప్పటికే విచారించారు. ఆమెను తానే హత్య చేసినట్లు నేరస్తుడు అతని సోదరుడికి కాల్ చేసి చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 

ALSO READ | ఇంటి ముందు ఆడుకోవడం ఇష్టం లేదని మూడేళ్ల బాలుడిని కిరాతకంగా..

వయాలికావల్‌లోని మున్నేశ్వర్‌‌ బ్లాక్‌‌ మొదటి అంతస్తులో మహాలక్ష్మిని 59 ముక్కలుగా నరికి ఆమె మృతదేహాన్ని నేరస్తుడు రిఫ్రిజిరేటర్‌‌లో స్టోర్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. శరీర భాగాలు నాలుగైదు రోజులుగా ఫ్రిజ్‌‌లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రిఫ్రిజిరేటర్లో ఆమె శరీర భాగాలు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి. మహాలక్ష్మి స్వస్థలం కర్నాటక కాదు. ఆమె వేరే రాష్ట్రం నుంచి వచ్చి కొంతకాలంగా షాపింగ్ మాల్లో పనిచేస్తూ ఒంటరిగా ఉంటోందని పోలీసుల తెలిపారు. గత శనివారం (సెప్టెంబర్  21, 2024) ఉదయం ఆమెను చూసేందుకు తల్లి, -చెల్లెలు రావడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.