మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : కలెక్టర్ విజయేందిర బోయి

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : మహిళా శక్తి కార్యక్రమాల ద్వారా వచ్చే ఐదేళ్లలో మహిళలను కోటీశ్వరులను  చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మహిళా సమాఖ్య భవనంలో మండల అధ్యక్షులు, డీపీఎం, సీసీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 15 మండలాల్లో 158 గ్రామ సంఘాలతో

6,747 మైక్రో ఎంటర్ ప్రైజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బస్టాండ్, ముసాపేట హైవే, సీసీ కుంట, జడ్చర్ల బస్టాండ్లలో 5 మహిళా శక్తి క్యాంటీన్ లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఆర్డీవో నర్సింహులు, అదనపు పీడీ జోజప్ప, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రజిత పాల్గొన్నారు.