ఢిల్లీలో గాలి పీల్చితే బతుకుడు కష్టమేనా..? ఫస్ట్ టైం 477కు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..

ఢిల్లీలో గాలి పీల్చితే బతుకుడు కష్టమేనా..? ఫస్ట్ టైం 477కు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..

ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో సక్కగ గాలి పీల్చుకుని బతికే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ దారుణంగా పడిపోతుంది. స్టేజ్-4 దశలోకి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ వచ్చేసింది. ఈ సీజన్లో ఫస్ట్ టైం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 450 మార్క్ను దాటేసింది. దీంతో.. ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం నుంచి గ్రాండెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP-IV) అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో AQI 462గా రికార్డయింది. 

గాలి కాలుష్యం కారణంగా పరిస్థితి అధ్వానంగా తయారైందని అర్థమైపోయేసరికి ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నుంచి ఆంక్షలు విధించాలని డిసైడ్ అయింది. సోమవారం నుంచి డీజిల్ వాహనాల(అత్యవసర సేవలకు సంబంధించిన సరుకులు రవాణా చేసే వాహనాలకు మినహాయింపు) రాకపోకలు నిషేధం విధించింది. సీఎన్జీ, బీఎస్-6 డీజిల్ వాహనాలు లేదా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. 

స్కూళ్లు, ఆఫీసుల కార్యకలాపాలపై కూడా ఆంక్షలు విధించింది. సోమవారం నుంచి 6 నుంచి 9 తరగతులు చదివే విద్యార్థులకు, 11వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. ఎన్సీఆర్ పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న  ఆఫీసులు 50 శాతం స్టాఫ్తో మాత్రమే నడవాలని, మిగిలిన 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలను అలర్ట్ చేసేందుకు ఎయిర్ క్వాలిటీ రీడింగ్స్ మానిటరింగ్ స్టేషన్లను 34 నుంచి 40కి పెంచింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. 401 నుంచి 450 మధ్య ఎయిర్ క్వాలిటీ ఉంటే గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్నట్టే. అలాంటిది.. ఢిల్లీలో ఏకంగా 462 నమోదయిందంటే దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం ఎంతలా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు.