- 11,060 సీట్లకు 10,692 భర్తీ
హైదరాబాద్, వెలుగు : బీ ఫార్మసీ ఫైనల్ ఫేజ్సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యింది. వివిధ కోర్సుల్లో 11,060 సీట్లు అందుబాటులో ఉండగా.. 10,692 సీట్లు అలాట్అయ్యాయి. ఇంకా 368 సీట్లు మిగిలి ఉన్నాయి. దాదాపుగా 96.7 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మా డీకి సంబంధించి 75 కాలేజీల్లో 1,691 సీట్లు అందుబాటులో ఉండగా.. 1,684 సీట్లు అలాట్ అయ్యాయి. ఇంకా ఏడు సీట్లు ఉన్నాయి.
99.6 శాతం సీట్ల కేటాయింపు జరిగింది. బయో మెడికల్ ఇంజినీరింగ్ కోర్సుకు సంబంధించి 2 కాలేజీల్లో 58 సీట్లు ఉండగా.. 58 సీట్లు అలాట్కాగా, 100 శాతం కేటాయింపు జరిగింది. ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కు సంబంధించి 3 కాలేజీల్లో 125 సీట్లకు120 సీట్లు భర్తీ అయ్యాయి. బయో టెక్నాలజీ కోర్సుకు సంబంధించి 4 కాలేజీల్లో 184 సీట్లు ఉండగా 181 సీట్లు భర్తీ అయ్యాయి.