రేపట్నుంచి(ఫిబ్రవరి 19) రాజేంద్రనగర్లో గ్రేప్​ ఫెస్టివల్

రేపట్నుంచి(ఫిబ్రవరి 19) రాజేంద్రనగర్లో గ్రేప్​ ఫెస్టివల్

గండిపేట, వెలుగు: సిటీ శివారులోని రాజేంద్రనగర్‌ ద్రాక్ష పరిశోధన కేంద్రంలో బుధవారం నుంచి ‘గ్రేప్​ఫెస్టివల్’​ మొదలవుతోంది. ఈ ఏడాది దాదాపు 30 రకాల ద్రాక్షా పండ్లను సిద్ధం చేశారు. ద్రాక్షా తోటల్లో కలియ తిరుగుతూ నచ్చిన పండ్లు టేస్ట్​చేసి కొనుక్కోవచ్చు. గ్రేప్‌ ఫెస్టివల్ లో దొరికే ద్రాక్ష పండ్ల రకాలతో సోమవారం కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వనంలో ఎగ్జిబిషన్, రైతు సమ్మేళనం​ఏర్పాటు చేశారు. వర్సిటీ వీసీ డాక్టర్‌ దండ రాజిరెడ్డి, ప్రఖ్యాత ద్రాక్ష నిపుణుడు డాక్టర్‌ ఎస్‌.డి.శిఖామణి, పద్మక్ష చింతల వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ద్రాక్ష సాగులో ఎదురవుతున్న సవాళ్లు, యజమాన్య పద్ధులను చర్చించారు. ద్రాక్ష పంటలో మానవ రహిత ట్రాక్టర్‌ వినియోగానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సీడీఏసీతో సంయుక్తంగా జరుగుతున్న పరిశోధన వివరాలను రైతులకు తెలియజేశారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎ.భగవాన్, డాక్టర్‌ డి.లక్ష్మీనారాయణ, డాక్టర్‌ టి.సురేశ్​కుమార్‌రెడ్డి, డాక్టర్‌ కె.వెంకటరమేశ్, డాక్టర్‌ కె.ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.