అమరావతి: దేశంలో కరోనా కేసులు రోజుకోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 1.79 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా 4 వేలు దాటాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కొవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు మాస్కు ధరించకపోతే రూ.50 ఫైన్ విధించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే ఈ రూల్ ను అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ‘పెనాల్టీ ఫర్ నో మాస్క్’ పేరుతో మాస్కు ధరించని వారికి రూ.50 ఫైన్ ను విధిస్తున్నారు.
#TSRTC also imposing pic.twitter.com/r7Hq1eAzIX
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 9, 2022
ఆర్టీసి బస్సులో ప్రయాణించేటప్పుడు మాస్కు
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 9, 2022
ధరించకపోతే ₹50 ఫైన్. pic.twitter.com/z6eohLpDas
ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఫైన్లు వేస్తున్న విషయాన్ని డీడీ న్యూస్ ఆంధ్రా ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేయగా.. దీనిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్ వీసీ సజ్జనార్ స్పందించారు. తాము కూడా ఇదే బాటలో నడుస్తున్నామని.. ఇప్పటికే ఫైన్ విధిస్తున్నామని రిప్లయ్ ఇచ్చారు.
మరిన్ని వార్తల కోసం: