గుప్తుల కాలం నాటి వాస్తుకళ నగర ద్రవిడ రీతుల సమ్మేళనం. ఈ కాలం నాటి వాస్తుకళ మూడు విధాలు 1. గుహాలయాలు 2. దేవాలయాలు 3. స్తూపాలు.
- చతురస్రాకారపు పై కప్పు కలిగిన దేవాలయాలు సాంచీలోని 17వ నంబరు గల ఆలయంలో ఉన్నాయి.
- చతురస్రాకారంపై విమానం కలిగిన దేవాలయాలు నాచ్నా(మధ్యప్రదేశ్)లోని పార్వతీ ఆలయం (ద్రావిడ శైలి), భూమ్రా (మధ్యప్రదేశ్)లోని శివాలయం.
- చతురస్రాకారంపై శిఖరం కలిగిన దేవాలయం దేవ్ఘఢ్(మధ్యప్రదేశ్)లోని దశావతార దేవాలయం, భితర్గాంలోని దేవాలయం.
- దీర్ఘచతురస్రాకారపు పై కప్పు కలిగిన దేవాలయాలు ఐహోల్లోని కపోతేశ్వర దేవాలయం, దుర్గా ఆలయాలు.
- వృత్తాకారపు పై కప్పు కలిగిన ఆలయం రాజగృహంలోని మణియార మఠం
దేవగఢ్ దేవాలయం
- ఇక్కడి దశావతార ఆలయం క్రీ.శ.6వ శతాబ్దానికి చెందింది.
- ఇది విశాలమైన అధిష్ఠానంపై ఉంది.
- కేంద్ర భాగంలో సమచతురస్రాకారపు గర్భగుడి ఉంది. గర్భ గృహ గోడలు, ఫలకాలపై సౌందర్యవంతమైన శిల్పాలంకరణలు దర్శనమిస్తాయి.
- ఉపరితల విమానం సూచీ ముఖాలంకృతంగా ఉండటం ఇంకో విశేషంగా చెప్పవచ్చు.
- అధిష్ఠానపు అన్ని మూలల్లోను చిన్న చిన్న దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఈ దేవాలయం ఐదు దేవతామూర్తులను కలిగి ఉంది.
భితర్గాం దేవాలయం
- గుప్తుల కాలంలో ఇటుకలతో కట్టిన మొదటి దేవాలయం భితర్గాం దేవాలయం
- బుద్ధగయలోని మహాబోధి దేవాలయం కూడా ఆరో శతాబ్దానికి చెంది భితర్గాం దేవాలయాన్ని పోలి ఉంది.
- గుప్తుల శిల్పకళాశైలి మధురశైలి నుంచి ఆవిర్భవించింది.
శిల్పకళారీతికి ఉదాహరణలు
- భూమ్ర – గణేశ్వర ఏకముఖ లింగాలు (బ్రహ్మ, యమ, కుబేర, కార్తికేయ, సూర్య, ఇంద్రాది ప్రతిమలు)
- దేవగఢ్ – విష్ణు, రామ, కృష్ణ ప్రతిమలు
- ఉదయగిరి – వరాహ విగ్రహం(ఒరిస్సా)
- రాజషాహి – కృష్ణుడు, అతని సహచరుల ప్రతిమలు
- సారనాథ్ – పద్మాసీనుడై ధర్మచక్ర ప్రవర్తన చేస్తున్న బుద్ధ విగ్రహం
- మధుర – ప్రభామండలం కలిగి నిలుచున్న బుద్ధ విగ్రహం
- పావయా (గ్వాలియార్) – స్త్రీ వాద్యకారులతో పరివేష్టించి ఉన్న నర్తకి ప్రతిమ
- గుప్తుల కాలంలో లోహాలను వెలికితీసి కరిగించి పోతపోసిన కళ మహకారకళ
- లోహకార కళలో ఉపయోగించిన లోహాలు వెండి, బంగారం, రాగి, ఉక్కు, కంచు.