కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో కళోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. కళోత్సవాల్లో అస్సామి కళాకారులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలతో పాటు ఇండోనేషియా, ఇజ్రాయిల్, మలేషియాకు చెందిన ఆర్టిస్టులు పర్ఫామెన్స్ చేయనున్నారు. దాదాపు 150కి పైగా కళా ప్రదర్శనలు జరగనున్నాయి.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కరీంనగర్ కళోత్సవాల్లో పాల్గన్న స్పీకర్..రాష్ట్రం లో అందరూ సుఖ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. కళలను ప్రోత్సహించే వ్యక్తుల్లో తాను ముందుంటానని చెప్పారు.
తెలంగాణ అంటేనే కళాకారులకు అడ్డా సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. కళలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటానని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ముందుకు వస్తే కరీంనగర్ లో త్వరలో సినీ తారలతో క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కళాకారులను ప్రోత్సహించే విధంగా కరీంనగర్ లో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సినీ నటుడు తరుణ్ అన్నారు.