కళాక్షేత్రానికి గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు పెట్టాలి : కంచ ఐలయ్య

కళాక్షేత్రానికి గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు పెట్టాలి : కంచ ఐలయ్య

హనుమకొండ సిటీ, వెలుగు : హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కళాక్షేత్రానికి గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు పెట్టాలని ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్ర’ అనే అంశంపై శుక్రవారం నక్కలగుట్ట హరిత హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కాళోజీ కేవలం కవి మాత్రమేనని, కళాక్షేత్రాలకు కళాకారుల పేర్లే పెట్టాలని కోరారు.

 ఓరుగల్లులో చుక్క సత్తయ్య, శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సారంగపాణి వంటి కళాకారులు ఉన్నారని కళాక్షేత్రానికి వారి పేర్లు పెట్టాలన్న ఆలోచన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ పాట, తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ రాజముద్రను మార్చినట్టే.. కళాక్షేత్రం పేరును సైతం మార్చి గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు పెట్టాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. రూ.కోట్లు ఖర్చు చేసి కడుతున్న క్షేత్రానికి కాళోజీ పేరు పెట్టడం కులతత్వం కాదా అని ప్రశ్నించారు. 

అవసరమైతే చుక్క సత్తయ్య -గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళాక్షేత్రంగా నామకరణం చేయాలని, గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రథమ వర్ధంతి ఆగస్టు 6లోగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. లేకపోతే రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలవుతోందన్నారు. సదస్సులో గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గళం ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొల్లూరి సత్తయ్య, కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రహీత పసునూరి రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూరపాటి వెంకటనారాయణ, ఉస్మానియా విద్యార్థి నాయకుడు నలిగంటి శరత్, డీఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్, టీజీవీపీ రాష్ట్ర జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ మేడ రంజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.