- ఆ రోజే బీఏసీ సమావేశం రేపు, ఎల్లుండి ఎమ్మెల్యేలకు శిక్షణ
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 16కు వాయిదా పడ్డాయి. దీంతో అసెంబ్లీ ఎన్ని రోజులు జరపాలి? చర్చించాల్సిన ఎజెండా ఏమిటి? అనే దానిపై జరగాల్సిన బీఏసీ సమావేశం కూడా నిర్వహించలేదు. సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్పర్యటనకు వెళ్తుండడం, ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలకు ఈ నెల 11,12వ తేదీల్లో ఎంసీహెచ్ఆర్డీలో పీఆర్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు ఉండడంతో అసెంబ్లీని16 వరకు వాయిదా వేసినట్టు తెలుస్తున్నది. అదే రోజు బీఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొని, అసెంబ్లీ పనిదినాలపై నిర్ణయం తీసుకోనున్నారు.