ఢిల్లీలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ప్రియురాలి తండ్రి, సోదరుల చేతిలో కత్తిపొట్లకు బలయ్యాడు. ఢిల్లీలోని బ్రహ్మపురికి చెందిన 25 ఏళ్ల యువకుడు సల్మాన్.. జాఫ్రాబాద్‌లో నివాసం ఉంటున్న ఓ అమ్మాయితో గత రెండేళ్లుగా స్నేహంగా ఉంటున్నాడు. ఈ ఫ్రెండ్ షిప్ కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆమెను మందలించారు. ఈ సంబంధాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు.
జులై 17వ తేదీ సోమవారం సాయంత్రం 5:15 గంటలకు.. జఫ్రాబాద్ ప్రాంతంలోని చౌహాన్ బంగర్, కళ్యాణ్ సినిమా సమీపంలో సల్మాన్ ఉన్నాడు. ఇతన్ని చూసిన యువతి తండ్రి మంజూర్, ఆమె సోదరులు మోహిసిన్, మరో వ్యక్తితో కలిసి ఆగ్రహంతో ఊగిపోతూ కత్తితో పొడిచి చంపేశారు. అందరూ చూస్తుండగానే సల్మాన్ ను చంపేశారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నరు. సల్మాన్ మెడపై, ఛాతీపై కత్తిపోట్లు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు.
https://twitter.com/wajidalichannel/status/1681235145750368257