వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కూతురిని చంపేసింది
బోధన్, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని ఓ మహిళ ప్రియుడితో కలిసి కూతురిని హత్య చేసింది. ఏసీపీ కిరణ్కుమార్తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామానికి చెందిన దేవళ్ల రాజు కూలి పనులు చేస్తుంటాడు. మూడు నెలల క్రితం ఆర్మూర్ ప్రాంతానికి కూలి పనికి వెళ్లగా చెంచు రజిత పరిచయమైంది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి కల్దుర్కి గ్రామంలో ఉంటున్నారు. రజితకు అప్పటికే అమ్ములు(3) అనే కూతురుంది. వారి సంబంధానికి అమ్ములు అడ్డొస్తోందని ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు.
మంగళవారం తెల్లవారుజామున ఇద్దరూ కలిసి చిన్నారి గొంతు పిసికి చంపేశారు. శవాన్ని తీసుకెళ్లి చెరువు కట్టపై ముండ్లపొదల్లో పడేశారు. డెడ్‌బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో బోధన్ రూరల్ ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. తల్లిపై అనుమానంతో ప్రశ్నించగా ఇద్దరూ కలిసి చంపేసినట్లు ఒప్పుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ చెప్పారు.