కలెక్టర్ పై దాడి ప్రతిపక్షం కుట్రే

  • పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి 

పరిగి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కలెక్టర్ పై జరిగిన దాడి ముమ్మాటికీ ప్రతిపక్షం చేసిన కుట్రేనని వికారాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  బీఆర్ఎస్ యూత్ లీడర్​సురేశ్​తప్పుదోవ పట్టించి దాడి చేయించేందుకు కారణమయ్యాడన్నారు.

ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు లగచర్లకు వెళ్లగా, ఈ సంఘటన జరిగిందన్నారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించిందని, బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు.