శుక్రవారం( డిసెంబర్ 6) అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ షర్ట్ స్లీవ్‌లకు నల్లటి బ్యాండ్‌లు ధరించారు. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో తలకు దెబ్బ తగిలి ఫిలిప్ హ్యూస్ 2014 లో మరణించాడు. అతడి 10 ఏళ్ల వర్ధంతిని ఆ జట్టు గుర్తు చేసుకుంటూ తమ సహచర క్రికెటర్ కు ఈ నివాళులు అర్పించింది. గతవారం షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లోనూ హ్యూస్ మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్‌లను ధరించారు.
నవంబర్ 27..2014 క్రికెట్ చరిత్రలో చాలా విషాదాన్ని నింపిన రోజు. కేవలం 25 ఏళ్ల ప్రతిభావంతుడైన క్రికెటర్ తలకు బంతి తగిలి ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. ఆస్ట్రేలియా అత్యుత్తమ ఓపెనర్ ఫిలిప్ హ్యూస్ మరణం ఆస్ట్రేలియాకే కాదు.. క్రికెట్ ప్రపంచానికే దిగ్భ్రాంతిని కలిగించింది. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌తో ఫిలిప్ హ్యూస్ గాయపడ్డాడు. బంతి అతని తల వెనుక తగలడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆ ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత నవంబర్ 27న హ్యూస్ మరణించాడు.
Also Read : భారత్‌ను దెబ్బ కొట్టిన స్టార్క్.. తొలి సెషన్ ఆసీస్‌దే
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. ఆతిధ్య ఆస్ట్రేలియాపై తొలి సెషన్ లో తడబడ్డారు. డిన్నర్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజ్ లో పంత్ (4), కెప్టెన్ రోహిత్ శర్మ(1) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీసుకోగా.. బోలాండ్ కు ఒక వికెట్ దక్కింది.
Australian players black armbands in the memory of Phillip Hughes 🥹#AUSvIND #NZvENG pic.twitter.com/o7Ur958KOR
— Aly⚡ (@alycricket) December 6, 2024