
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ ఆపరేషన్స్, పర్సనల్ అండ్ వెల్ఫేర్( పా(పీఏడబ్య్లూ) అదనపు బాధ్యతలు) డైరెక్టర్ శ్రీనివాస్పైవేటుకు యాజమాన్యం రెడీ అయినట్టు తెలిసింది. ఆయన బాధ్యతలను డైరెక్టర్ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వరరెడ్డికి, డైరెక్టర్ ఆపరేషన్స్ బాధ్యతలను డైరెక్టర్ డి. సత్యనారాయణకు అప్పగిస్తూ యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డైరెక్టర్ శ్రీనివాస్‌ను తొలిగిస్తారనే చర్చ కొత్తగూడెంలోని హెడ్డాఫీస్లో నడుస్తోంది.
పీఏడబ్య్లూ డైరెక్టర్ కంపెనీలో కీలకమైనది. తొమ్మిది నెలల కిందనే ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఇటీవల శ్రీనివాస్ పై రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎండీకి ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వంలోని కీలక శాఖ మంత్రితో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా డైరెక్టర్ శ్రీనివాస్ పనితీరు బాగోలేదంటూ సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా రెండు యూనియన్ల నేతలు కూడా ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది.
కాగా.. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్‌లో శ్రీనివాస్ జీఎంగా ఉన్నప్పుడే పలు అవినీతి ఆరోపణలు రావడంతో సింగరేణివ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నెల 15న కొలంబియాలో ప్రపంచ రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు పాల్గొననుండగా, టీమ్‌తో వెళ్లాల్సిందిగా యాజమాన్యం ఆయనకు సూచించింది. దీంతో పొమ్మన లేక పొగ పెట్టిందనే చర్చ సాగుతోంది.
గత పా డైరెక్టర్ దత్తాత్రేయులుపై అవినీతి ఆరోపణల కారణంగా సంస్థ టెర్మినేట్చేసింది. ఇలాగే మరో డైరెక్టర్ రాజారాంను కూడా తప్పించిన దాఖలాలున్నాయి. ప్రస్తుత డైరెక్టర్ శ్రీనివాస్‌ను కూడా టర్మినేట్ చేసేందుకు విజిలెన్స్ ద్వారా సమాచారం సేకరిస్తున్నట్టుగా కంపెనీలో ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా పొలిటికల్ప్రెజర్, ఆయన పనితీరు, గత అవినీతి ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి తొలగించే చాన్స్ ఎక్కువగా ఉందని హెడ్డాఫీస్‌లోని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.