పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళల్లో మార్పులు

ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళల్లో మార్పులు చేశారు అధికారులు.. ఉభయసభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు రాజ్యసభ.. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ఉండటంతో ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. సభలో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటుచేశారు అధికారులు.

మరిన్ని వార్తల కోసం

మహారాష్ట్రలో ప్రమాదం: ఏడుగురి మృతి

దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు