దాదాపు సంవత్సర కాలం నుంచి ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చే 90 శాతం నగదు డీఏ మూడు విడతలుగా ఇచ్చే బకాయిలు, సంవత్సర కాలమైనా ఇంకా మంజూరు కాలేదు. పీఆర్సీ బకాయిలు కేవలం నాలుగు విడతలుగానే ఇచ్చారు. దాదాపు అవి కూడా పెండింగ్. ఉద్యోగులకు ఇచ్చే మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వీటి చెల్లింపులు ఎప్పుడో అర్థం కాని పరిస్థితి ఉంది. ట్రెజరీ అధికారులు కూడా సమాచారం ఇవ్వడం లేదు. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినా కూడా బిల్లులు చెల్లించడం లేదు. ఎన్నికలు వస్తున్న వేళ, ఇకనైనా ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా అధికారులు స్పందించాలి.
- యాడవరం చంద్రకాంత్ గౌడ్,రాష్ట్రీయ పండిత పరిషత్ ఉపాధ్యక్షుడు