- రోడ్డంతా చెల్లాచెదురుగా పడిపోయిన కూరగాయలు
- కాపాడుకునేందుకు డ్రైవర్, వ్యాపారుల తిప్పలు
ఆత్మకూరు వెలుగు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో హైవేపై టమాటలతో వెళ్తున్న ఓ ట్రాలీ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. కొందరు వ్యాపారులు గురువారం వరంగల్ నుంచి ఏటూరునాగారానికి కూరగాయలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై చెల్లా చెదురుగా టమాటలు, కూరగాయలు పడిపోవడంతో అటుగా వెళ్తున్న వారు చూశారు.
దీంతో టమాటాలు తీసుకెళ్లకుండా కాపాడుకునేందుకు డ్రైవర్, వ్యాపారులు కాపాలా కాస్తూ తిప్పలు పడాల్సి వచ్చింది. వెంటనే మరో ఆటో తెప్పించి కూరగాయలను అందులోకి షిఫ్ట్ చేసుకుని వెళ్లిపోయారు.