హైదరాబాద్లో మార్చి నెల బ్యాంకు సెలవులు.. ఈ 8 రోజులు బ్యాంకులు బంద్

హైదరాబాద్లో మార్చి నెల బ్యాంకు సెలవులు.. ఈ 8 రోజులు బ్యాంకులు బంద్

2025లో రెండు నెలలు కాలగర్భంలో కలిసిపోవడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి నెలలో 28 రోజులే కావడంతో క్యాలెండర్ పేజ్ తిప్పే టైమొచ్చింది. నెల మారుతుందంటే మారేది క్యాలెండర్ లో పేజ్ మాత్రమే కాదు. కొత్త నెల వస్తుందంటే బ్యాంకు సెలవులు కూడా గుర్తుపెట్టుకుని అలర్ట్గా ఉండాలి. హైదరాబాద్ సిటీలో.. మార్చి 2025లో 8 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చిలో హోలీ, రంజాన్.. ఇతరత్రా సెలవుల కారణంగా హైదరాబాద్లో 8 రోజులు పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఆర్బీఐ ప్రకారం.. హైదరాబాద్ నగరంలో బ్యాంక్ హాలిడేస్ ఈ కింది విధంగా ఉన్నాయి.

1. మార్చి 2 (ఆదివారం)
2. మార్చి 8 (రెండో శనివారం)
3. మార్చి 14 (హోలీ)
4. మార్చి 16 (ఆదివారం)
5. మార్చి 22 (నాలుగో శనివారం)
6. మార్చి 23 (ఆదివారం)
7. మార్చి 30 (ఆదివారం, ఉగాది)
8. మార్చి 31 (రంజాన్)

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు యథావిధిగా పనిచేస్తాయి. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు బ్యాంకు సెలవుల గురించి ముందస్తు సమాచారంతో ఉండటం వల్ల కస్టమర్లు బ్యాంకులకు వెళ్లి నిరాశతో వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు.