బంగ్లాదేశ్‌తో డిసెంబర్ 14న ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్‌కి బీసీసీఐ 17 మందితో కూడిన భారత టెస్ట్ జట్టుని ప్రకటించింది. గాయాల కారణంగా జట్టుకు దూరం అయిన ప్లేయర్లకు బదులుగా కొత్త ప్లేయర్లను టీంలోకి తీసుకుంది. రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్, షమీ, జడేజాల స్థానంలో నవదీప్ సైని, సౌరభ్ కుమార్‌లను ఎంపిక చేసింది. కెప్టెన్సీ బాద్యతల్ని కేఎల్ రాహుల్‌కి అప్పగించింది.
బంగ్లాతో ఫస్ట్ టెస్టు 14 నుంచి 18 వరకు, సెకండ్ టెస్టు 22 నుంచి 26 వరకు జరగనుంది. ఇప్పటికే జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా 2–1 సొంతం చేసుకుంది. అయితే, 2023లో జరగబోయే టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోటీల్లో నిలవాలంటే ఈ సిరీస్‌ని తప్పక క్లీన్ స్విప్ చేయాలి.
జట్టు వివరాలు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (w/k), కేఎస్ భరత్ (w/k), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, నవదీప్ సైని, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్