ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో శంషాబాద్‌లోని నానాజీపూర్ వాటర్ ఫాల్స్ అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రతి ఏడాది వానాకాలంలో శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల చెరువు నిండితే ఆ నీరంతా నానాజీపూర్ గ్రామంలోని బండరాళ్ల మీదుగా హిమాయత్ సాగర్ కు చేరుకుంటాయి.
దీంతో నానాజీపూర్ వద్ద వాటర్ ఫాల్స్ ఏర్పడి ఈ సీజన్ లో టూరిస్ట్ స్పాట్ గా మారుతుంది. శుక్రవారం నానాజీ పూర్ వాటర్ ఫాల్స్ ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల జనం పిల్లలతో కలిసి వచ్చారు. గతేడాది ఈ వాటర్ ఫాల్స్ లో ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తులో నీటిలో మునిగి చనిపోవడంతో నానాజీపూర్ గ్రామ సర్పంచ్, అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
సెక్యూరిటీ సిబ్బందిని సైతం నియమించారు. వరద ఉధృతి పెరిగితే ఎవరిని వాటర్ ఫాల్స్ వద్దకు అనుమతించమని అధికారులు చెప్పారు.
- వెలుగు, శంషాబాద్