
వర్షాలు జోరుగా కురుస్తున్న వేళ.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఏజెన్సీలో ఉన్న వెన్నెల వాటర్ ఫాల్స్ అందాలు వేరే లెవల్ ఉన్నాయి. రథం గుట్ట నుంచి పాల నురగలా కొండల్లోంచి జల జల జాలువారుతున్న వెన్నెల జలపాతం ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. చూసేందుకు పర్యాటకలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
మణుగూరు నుంచి కేవలం కిలో మీటర్ దూరంలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ వద్ద ఫారెస్ట్ అధికారులు పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా.. అందుకు తగిన సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలని కోరుతున్నారు.
- భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు