అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

హైదరాబాద్/రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల ప్రక్రియ కొనసాగుతోందని.. తొందరలోనే అర్హులకు వాటిని అందిస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. మంగళవారం కొల్లూరులోని డబుల్ బెడ్రూం ఇండ్లను డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మట్లాడుతూ.. 145 ఎకరాల్లో పేదల కోసం ఇండ్లను నిర్మించడం దేశంలోనే మొదటిసారి అని పేర్కొన్నారు. దాదాపు లక్ష మంది పేదలు ఉండేలా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారన్నారు. స్థానికులతో పాటు గ్రేటర్ లోని అర్హులైన వారికి వీటిని అందిస్తామన్నారు.  పటాన్​చెరు పరిధిలో దాదాపు 30 వేల డబుల్​ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించిందని.. తొందరలోనే వాటిని కూడా ఓపెన్ చేస్తామన్నారు. మేయర్ వెంట బల్దియా హౌసింగ్ సీఈ సురేశ్, అధికారులు ఉన్నారు.