
- ఎఫ్‌టీసీసీఐ హెచ్‌ఆర్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం టాలెంట్ ఉన్నోళ్లను హైర్ చేసుకోవడమే పెద్ద సవాలుగా మారిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తాను సోలార్ ఇండస్ట్రీకి చెందినవాడిని కాకపోయినా సోలార్ ప్యానెల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చి, దానికి సంబంధించిన పేటెంట్ కూడా పొందానని ఆయన తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) హెచ్‌ఆర్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. దీనికి వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రెడిషనల్ బిజినెస్, స్టార్టప్‌లలో పని చేసిన అనుభవం తనకు ఉన్నదని చెప్పారు.
గౌరవ అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. యువత సవాళ్లను ఎదుర్కొని, పారిశ్రామిక రంగంలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.రవికుమార్, వైస్ ప్రెసిడెంట్ కె.కె. మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 200 మందికి పైగా హెచ్‌ఆర్ నిపుణులు, పరిశ్రమల ప్రముఖులు హాజరయ్యారు.