ప్రపంచంలో అతి పెద్ద మెరుపు

ప్రపంచంలో అతి పెద్ద మెరుపు
  • అమెరికాలో 768 కి.మీ ఫ్లాష్​ మెరుపు గుర్తింపు

న్యూయార్క్/జెనీవా: ప్రపంచంలోనే అతిపెద్ద మెరుపును అమెరికాలో గుర్తించినట్లు యునైటెడ్​ నేషన్స్​ ఇంటర్​గవర్నమెంటల్​ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు 2020 ఏప్రిల్​9న యూఎస్ లోని మిసిసిప్పి, లూసియానా, టెక్సాస్​లలో దాదాపు 768 కిలోమీటర్ల  మేర ఫ్లాష్​మెరుపును గుర్తించినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా 2018 అక్టోబర్​31న దక్షిణ బ్రెజిల్‌లోని కొన్ని ప్రాంతాల్లో నమోదైన మెరుపు కంటే ఇది 60 కిలోమీటర్లు ఎక్కువ వ్యాపించి రికార్డు నెలకొల్పినట్లు డబ్ల్యూఎంవో ప్రకటించింది. ఫ్లాష్​రిజల్ట్స్​ అమెరికన్​మెటరలాజికల్​సొసైటీ బులెటిన్​లో ప్రచురించారు. ఈ​ మెరుపు ఫ్లాష్  అసాధారణమైనదని డబ్ల్యూఎంవో ప్రతినిధి ప్రొఫెసర్ రాండాల్ సెర్వెనీ చెప్పారు. ఇటీవలి కాలంలో టెక్నాలజీ బాగా డెవలప్​ కావడంతో మెరుపుల పొడవు, డ్యురేషన్​ గుర్తించడం ఈజీ అయ్యిందని, శాటిలైట్​లైట్నింగ్, ఇమేజరీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.