
రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది బర్త్ డే బాయ్’. విస్కి దర్శకుడు. బొమ్మ బొరుసా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. శుక్రవారం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఫన్నీ సీన్‌తో విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక కామెడీ డ్రామా.
ఎం.ఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లిన ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో తెరకెక్కించాం. సహజత్వం కోసం సింక్ సౌండ్ వాడాం. సినిమాలోని ప్రతి పాత్ర ఎంటర్‌టైన్ చేస్తుంది. కంటెంట్‌తో పాటు చక్కని టెక్నికల్ వాల్యూస్ మంచి క్వాలిటీ సినిమాను తీసుకొస్తున్నాం’ అని చెప్పాడు.