స్వీట్స్ వెనుక దాగున్న చేదు నిజం.. హైదరాబాద్లో ఇంత ఘోరంగా తయారు చేస్తున్నారా..? తింటే ఇక అంతే..

స్వీట్స్ వెనుక దాగున్న చేదు నిజం.. హైదరాబాద్లో ఇంత ఘోరంగా తయారు చేస్తున్నారా..? తింటే ఇక అంతే..

పండుగలు, పబ్బాలు, పార్టీలు, ఫంక్షన్ లు.. ఇలా ఏ అకేషన్ కైనా వెంటనే గుర్తొచ్చేది స్వీట్ హౌజ్. ‘‘ఫంక్షన్ కు ఉత్త చేతులతో ఏం వెళ్దాం.. ఓ స్వీట్ బాక్స్ తీసుకెళ్దాం.. చుట్టాలొస్తున్నారు.. స్వీట్స్ పట్రా.. అమ్మాయి టెన్త్ పాసైంది.. స్వీట్ తినిపిద్దాం.. పెళ్లి కుదిరిందిగా.. కంగ్రాచులేషన్స్.. ఈ స్వీట్ తిను..’’ ఇలా ప్రతి మూమెంట్ ను స్వీట్ తో సెలబ్రేట్ చేసుకోవడం ఇండియన్ కల్చర్ లో భాగం అయిపోయింది. కానీ మనం తినే స్వీట్ వెనుక చాలా నిజాలు దాగున్నాయని గుర్తు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ లో పలు ఏరియాల్లో స్వీట్ హౌజ్ లలో చేసిన తనిఖీలలో విస్తు పోయే నిజాలు వెలుగు చూశాయి. ఇన్నాళ్లుగా ఇలాంటి స్వీట్సా మనం తింటున్నది అని నోరెళ్లబెట్టాల్సిందే.

ఉగాది సందర్భంగా ఆదివారం (మార్చి 30) హైదరాబాద్ లోని మల్లాపూర్ అమన్ మిఠాయి వాలా లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. స్వీట్ షాప్ లైసెన్స్ అక్రమంగా తీసుకున్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా.. దుర్గంధం వెదజల్లుతూ ఉన్నట్లు  గుర్తించారు. 

ఈ దాడులలో 300 కిలోల ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్వీట్స్ తయారీలో ఎలాంటి పరిశుభ్రత పాటించడం లేదు. గుట్కా తింటూ స్వీట్స్ తయారు చేస్తుండటాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. అంతేకాకుండా అత్యధిక మోతాదులో స్వీట్స్ లో ఫుడ్ కలర్స్ కలుపుతున్నారని చెప్పారు. ఇక్కడ తయారు చేసే స్వీట్స్ తింటే హెల్త్ ఇష్యూస్ ఖాయమని హెచ్చరించారు. స్వీట్ హౌజ్ ఓనర్స్ పై చర్యలకు ఆదేశించారు