హైదరాబాద్, వెలుగు : ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఓల్డ్‌సిటీలో బీజేపీ పాగా వేసింది. మూడు డివిజన్లకే పరిమితమైన ఆ పార్టీ 10 డివిజన్లకు విస్తరించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి టెంపుల్, ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్, రోహింగ్యాల ఏరివేత ప్రధాన అస్త్రాలుగా బీజేపీ ప్రచారం చేసింది. వరద సాయాన్ని ఆపాలని ఈసీకి బీజేపీ లెటర్ రాసినట్టు సీఎం కేసీఆర్చేసిన ఆరోపణలను ఖండించిన బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్.. ఈ లేఖ విషయంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట ప్రమాణం చేయాలని ఆయనకు సవాల్విసరడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. ఇదే టెంపుల్లో పూజలు చేయడం, ఓల్డ్ సిటీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రచారం కలిసొచ్చింది.
ఎంఐఎం సిట్టింగ్ స్థానంలో..
టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన ఏడు డివిజన్లను, ఎంఐఎం గెలిచిన ఒక డివిజన్‌ను బీజేపీ గెలిచింది. ఐఎస్సదన్నుంచి జె.శ్వేత, గుడి మల్కాపూర్ డివిజన్‌నుంచి దేవర కరుణాకర్, గోషామహల్‌నుంచి లాల్ సింగ్, చంపాపేట నుంచి మధుసూదన్‌రెడ్డి, జియాగూడ నుంచి దర్శన్, మంగళ్హట్నుంచి శశికళ, సైదాబాద్నుంచి అరుణ టీఆర్ఎస్ సిట్టింగ్స్థానాల్లో గెలిచారు. జాంబాగ్ ఎంఐఎం సిట్టింగ్ స్థానం కాగా.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాకేశ్ జైస్వాల్ గెలిచారు. సిట్టింగ్ స్థానాలైన బేగం బజార్ నుంచి శంకర్‌యాదవ్, గౌలిపుర నుంచి భాగ్యలక్ష్మి గెలుపొందారు. ఘాన్సీ బజార్ లో మాత్రం ఎంఐఎం గెలిచింది.