కరోనా వస్తే దీదీని హగ్​ చేసుకుంటానన్న బీజేపీ నేతకు పాజిటివ్

కోల్​కతా: తనకు కరోనా వస్తే నేరుగా వెళ్లి వెస్ట్​ బెంగాల్​ సీఎం మమతను హగ్​ చేసుకుంటానని కాంట్రవర్సీ కామెంట్స్​చేసిన బీజేపీ నేషనల్​ సెక్రటరీ అనుపమ్​ హజ్రాకు కరోనా నిర్ధారణ అయింది. రెండు రోజులుగా ఒంట్లో అనీజీగా ఉండడంతో ఆయన శుక్రవారం టెస్ట్​ చేయించుకోగా పాజిటివ్​ అని తేలింది. దీంతో ఆయన ట్రీట్​మెంట్​ కోసం  కోల్​కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చేరారు. అనుపమ్ హజ్రా ఇటీవల వెస్ట్​బెంగాల్​ సీఎం మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కరోనా పేషెంట్ల బాధలు సీఎంకు తెలియడం లేదని, ఒకవేళ తనకు కరోనా వస్తే నేరుగా వెళ్లి దీదీని హగ్​ చేసుకుంటానని, కరోనా బారిన పడినవారి బాధలు ఎలాఉంటాయో తెలిసేలా చేస్తానన్నారు.

For More News..

మంత్రాలు చేస్తోందనే డౌట్​తో తల వేరు చేసిన్రు.. అడ్డొచ్చిందని టీచర్‌నూ చంపిన్రు

సోనీ నుంచి వైర్​లెస్​ హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌

థియేటర్లు ఓపెన్ అయినా ఓటీటీలకు ఫుల్ డిమాండ్