- బీజేపీ నాయకులు
నల్గొండ, వెలుగు : జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని బీజేపీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నల్గొండలో జిల్లా పార్టీ ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీతోపాటు బీఆర్ఎస్సర్కారు వదిలేసిన డిండి ప్రాజెక్టు పనులు త్వరగా కంప్లీట్ చేయాలన్నారు. ఈ రెండు పార్టీలు జిల్లా రైతులను అన్యాయం చేశాయని, ఎప్పటికైనా కాంగ్రెస్ మంత్రులు కృష్ణ జలాలతో మనకు రావాల్సిన వాటా కోసం కృషి చేయాలన్నారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హిందువులను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్నాగం వర్షిత్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బండారపు లింగస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.