బీజేపీ పై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. అంబేద్కర్ ని గౌరవించని బీజేపీ పార్టీకీ గట్టిగా బుద్ధిచెప్పాలని అన్నారు. వరంగల్ హంటర్ రోడ్ లోని డీ కన్వెన్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ నరేంద్ర మోదీ కేంద్రంలో మళ్లీ వస్తే పేద ప్రజలకు, ముస్లింలకు ఎంత నష్టం జరుగుతుందో అని భయమేస్తుందన్నారు. మహిళకు అందరికీ లక్ష రూపాయల ఆర్ధిక సహాయం కాంగ్రెస్ పార్టీ అందించనుందని తెలిపారు. వరంగల్ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదని విమర్శించారు. కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.