పోకిరిలపై.. చర్యలు తీసుకోవాలని వినతి

నవీపేట్, వెలుగు: నవీపేట్​లోని మోడల్ బాలికల స్కూల్, బస్టాండ్​ ప్రాంతాల్లో అమ్మాయిలను వేధిస్తున్న పోకిరిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేవైఎమ్​ నాయకులు బుధవారం ఎస్ఐ యాదగిరిగౌడ్ కు ఫిర్యాదు చేశారు.

బీజేవైఎమ్​ జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. స్కూల్స్ కు వెళ్లే అమ్మాయిలే టార్గెట్ గా కొందరు ఆకతాయిలు తమ వెకిలి చేష్టలతో అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.