హైదరాబాద్ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. శుక్రవారం (24 జనవరి) ఉదయం 9 గంటలు దాటినా పొగ మంచు వీడలేదు. రోడ్లపై మంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలకు హెడ్ లైట్లు వేసుకొని స్లోగా మూవ్ అవుతున్నారు.
సిటీ శివారులో మంచు దుప్పటి కప్పుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం. విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు కమ్మేసింది. ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దఅంబర్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
హైదరాబాద్ లో దట్టమైన మంచు కురుస్తుండటంతో వీధులు, రోడ్లు ఢిల్లీని తలపిస్తున్నాయి. పొగ మంచు ప్రభావంతో జనం బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.