![ఏపీ వరదలు: బుడమేరులో చిక్కుకున్న బోటు.. తప్పిన ప్రమాదం](https://static.v6velugu.com/uploads/2024/09/the-boat-got-stuck-in-budameru-of-nandiwada-mandal-of-krishna-district_KPIBwAc97S.jpg)
కృష్ణాజిల్లా నందివాడ మండలం బుడమేరులో తృటీలో పెను ప్రమాదం తప్పింది. బుడమేరు ప్రవాహంలో చిక్కుకుపోయింది బోటు. పుట్టగుంట నుంచి ఓడ్డుకు దాటుతుండగా అదుపు తప్పిన బోటు వంతెన రెయిలింగ్ లో ఇరుక్కుపోయింది. గజఈతగాళ్లు,ఎఫ్డీఆర్ఎఫ్ బృందం వెంటనే స్పందించి బుడమెరులో దూకి బోటును ఒడ్డుకు తెచ్చారు. బోటులోని అధికారులు,టీడీపీ నేతలు,మీడియా ప్రతినిధులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
మరో వైపు బుడమేరు గండ్లను పూడుస్తున్నారు అధికారులు. ఒక్కో గండి 10 నుంచి 15 మీటర్ల వరకు ఉండగా.. మూడో గండి 80 నుంచి 100 మీటర్ల వరకు ఉందని తెలిపారు. సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.