సెబీ మాజీ చైర్‌‌‌‌పర్సన్‌‌ మాధవి, మరో ఐదుగురికి హైకోర్టులో ఊరట

సెబీ మాజీ చైర్‌‌‌‌పర్సన్‌‌ మాధవి, మరో ఐదుగురికి హైకోర్టులో ఊరట

న్యూఢిల్లీ: సెబీ మాజీ చైర్‌‌‌‌పర్సన్‌‌ మాధవి పూరి బుచ్‌‌, మరో ఐదుగురిపై ఎఫ్‌‌ఐఆర్ ఫైల్ చేయాలని ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు తాత్కాలికంగా ఆపింది. వీరిపై మంగళవారం వరకు ఏసీబీ ఎఫ్‌‌ఐఆర్ ఫైల్ చేయొద్దని ఆదేశించింది.

స్టాక్ మార్కెట్ ఫ్రాడ్‌‌ చేశారనే ఆరోపణలపై మాధవి,  బీఎస్‌‌ఈ ఎండీ సుందరరమణ్‌‌ రామమూర్తి, ముగ్గురు సెబీ హోల్‌‌టైమ్ డైరెక్టర్లు అశ్వినీ భాటియా, అనంత్‌‌ నారాయణ్‌‌, కమ్లేష్‌‌ చంద్ర వర్ష్నేపై ఏసీబీ దర్యాప్తు జరపాలని ఏసీబీ స్పెషల్ కోర్టు ఆదివారం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఆదేశాలను కొట్టేయాలని  సోమవారం వీరు బాంబే హైకోర్టుకి  వెళ్లారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వీరి తరపున వాదించారు.  ఈ ఇష్యూకి సంబంధించి మంగళవారం హైకోర్టులో హియరింగ్ ఉంది. అప్పటి వరకు ఏసీబీ ఎఫ్‌‌ఐఆర్ ఫైల్ చేయొద్దని బాంబే హైకోర్ట్‌‌ సింగిల్ బెంచ్ జడ్జ్‌‌ ఎస్‌‌జీ డిజి తీర్పిచ్చారు.