ఘనంగా బోనాల పండుగ...

ఆదిలాబాద్/ బెల్లంపల్లి/ నిర్మల్/ మందమర్రి/ నస్పూర్/ వెలుగు ఫోటోగ్రాఫర్ :  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  బోనాల పండుగ ఆదివారం ఘనంగా జరిగింది.  ఆషాడ మాసం చివరి ఆదివారం కావడంతో అమ్మవారి ఆలయాలకు బోనాలతో పెద్ద ఎత్తున క్యూ కట్టారు .   ప్రత్యేక నైవేధ్యంసమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు.   బెల్లంపల్లిలోని టేకులబస్తీలో, కన్నాలబస్తీ, రడగంబాల బస్తీ, బెల్లంపల్లి బస్తీలతో పాటు మండలంలోని కన్నాల, తాళ్ళగురిజాల నుంచి మహిళలు పూజలు చేసి బోనాలతో  పోచమ్మ చెరువు వద్ద  అమ్మవారి  ఆలయానికి చేరుకున్నారు.   ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ బోనాల పండుగలో పాల్గొన్నారు.  నిర్మల్​లో   నందిగుండం దుర్గమాత ఆలయంలో,  మందమర్రి పట్టణంలో శ్రీ మహాంకాళి బద్ది పోచమ్మ, ఏడుగురు అక్క చెల్లెళ్ళ(గ్రామదేవతలు) ఆషాడ బోనాల    జాతరను కన్నులపండువగా నిర్వహించారు.

 

అంగడీబజార్​ సీఎస్పీ రోడ్​లోని శ్రీనిలయం, శ్రీలలితాశ్రమం నుంచి మహిళలు, భక్తులు బోనాలతో  త్రిశక్తి దేవాలయానికి తరలివచ్చారు.  డప్పు చప్పుళ్ల , కోలాటం మధ్య భక్తులు పూనకాలతో శోభాయాత్ర  సాగింది.  నస్పూర్ ఆదిపరా శక్తి ఆలయంలో, మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట వద్ద నున్న గాంధారీమైసమ్మ ఆలయంలో నిర్వహించిన ఆషాడ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఉదయం బొక్కలగుట్ట  గ్రామశివారులోని రాళ్లవాగు ఒడ్డున ముందుగా   చెట్టు వద్ద బోనాలను ఉంచి పూజలు డప్పుచప్పుళ్ల మధ్య  మహిళలు, భక్తులు,  శివసత్తులు బోనాలను నెత్తిన పెట్టుకొని  మైసమ్మ తల్లి  ఆలయానికి  శోభాయాత్రగా వెళ్లారు.  చారిత్రక గాంధారీఖిల్లా కోటలో కొలువైన మైసమ్మ తల్లికి మేకపోతును గావుపట్టారు.  జాతరలో  బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల  మహేశ్​, చెన్నూరు ఎమ్మెల్యే సుమన్​,  మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,  క్యాతనపల్లి మున్సిపల్​​ చైర్​ పర్సన్​ జంగం కళ, బీజేపీ డిస్ర్టిక్ట్​ జనరల్​ సెక్రటరీ, చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జీ అందుగుల శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.