- సలహాదారులుగా రామచంద్రమూర్తి, ప్రొ.కోదండరాం
ముషీరాబాద్, వెలుగు : హైదరాబాద్ బుక్ ఫెయిర్–2024 గౌరవ సలహాదారులుగా ప్రముఖ సాహితీవేత్త రామచంద్రమూర్తిని, ప్రొఫెసర్కోదండరాంను బుక్ ఫెయిర్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుక్ ఫెయిర్ జనరల్ బాడీ మీటింగ్జరిగింది. కొత్త నిబంధనలను కమిటీ ఆమోదించింది. ఎప్పటిలాగే డిసెంబర్ చివరి వారంలో బుక్ఫెయిర్నిర్వహించాలని నిర్ణయించింది.
త్వరలోనే తేదీలను, స్టాళ్ల నిర్వహణనకు అప్లికేషన్ల ప్రకటన ఉంటుందని స్పష్టం చేసింది. అనంతరం రామచంద్రమూర్తిని కమిటీ సభ్యులు సన్మానించారు. బుక్ ఫెయిర్ ప్రెసిడెంట్ కవి యాకూబ్, జనరల్ సెక్రటరీ ఆర్.వాసు, వైస్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, శోభన్ బాబు, ట్రెజరర్ నారాయణ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సూరిబాబుతోపాటు తెలుగు పబ్లిషర్లు పాల్గొన్నారు.