రాయదుర్గంలో టీచర్ గోడ కుర్చీ వేయించడంతో ఉరేసుకున్న బాలుడు

రాయదుర్గంలో టీచర్ గోడ కుర్చీ వేయించడంతో ఉరేసుకున్న బాలుడు
  • ఈ నెల 4న టీచర్ గోడ కుర్చీ వేయించడంతో ఉరేసుకున్న బాలు

గచ్చిబౌలి, వెలుగు: క్లాస్ రూంలో గోడ కుర్చీ వేయించడంతో మనస్తాపంతో  ఉరేసుకుని సూసైడ్ యత్నం చేసిన10వ తరగతి స్టూడెంట్ ఆదివారం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాయదుర్గంలోని నాగార్జున హైస్కూల్​లో బాలు అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు.  ఇక్కడ అబ్దుల్ నయీమ్ మాథ్స్ టీచర్‌‌‌‌. ఈ  నెల 4న బాలు మ్యాథ్య్ సరిగా చేయడం లేదని టీచర్ నయీమ్ మందలించాడు. 

 క్లాస్ రూమ్‌‌లో అందరి ముందు బాలుతో  గోడ కుర్చీ వేయించాడు.  మిగిలిన విద్యార్థుల ముందు తిట్టడంతో బాలు మనస్తాపానికి గురయ్యాడు. సాయంత్రం ఇంటికి వెళ్లి ఫ్యాన్‌‌కు చున్నీతో ఉరేసుకుని సూసైడ్ కు యత్నించాడు. గమనించిన తల్లి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి బాలును రక్షించి ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు.  

నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలు ఆదివారం హాస్పిటల్​లో చికిత్స పొందుతూ చనిపోయాడు.  పరిగిలో అంత్యక్రియలను నిర్వహించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.