వర్చువల్ ఇంటరాక్షన్‌లో విద్యాశాఖ మంత్రి మంత్రి మధు బంగారప్పకి కన్నడ రాదు అని ఓ బాలుడు అన్నాడు. దీంతో కర్ణాటక విద్యాశాఖ మంత్రి బాలుడిపై ఫైర్ అయ్యాడు. కర్నాటక నుంచి సీఈటీ, జేఈఈ, నీట్ పరీక్షలకు హాజరవుతున్న 25 వేల మంది విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించే ప్రొగ్రామ్ కర్ణాటక ప్రభుత్వ నవంబర్ 20 ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. సందర్భంగా విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప విద్యార్థులతో వర్చువల్ ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ బాలుడు మంత్రికి కన్నడ రాదని అన్నాడు. బాలుడి మాటలు విన్న మినిస్టర్ మధ బంగారప్ప మొదట్లో కూల్‌గానే ఉన్నాడు. కానీ వెంటనే ఆవేశానికి లోనయ్యారు. మనస్తాపం చెందిన మంత్రి విద్యార్థిపై చర్యలకు ఆదేశించారు.
పాఠశాల విద్య, అక్షరాస్యత మంత్రి మధు బంగారప్పకి కన్నడపై అవగాహన లేదని తరుచూ ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రితేష్ కుమార్, పియు డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ సింధు రూపేష్‌ను ఆయన కోరారు. విద్యార్థిని గుర్తించి అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని విద్యాశాఖ అధికారులు ఇంకా చెప్పలేదు. ఈ వ్యాఖ్యలు విద్యార్థి అన్నాడా.. లేక అధికారి అన్నాడా అనేది ఆడియోలో స్పష్టంగా తెలియడం లేదని కొందరు అంటున్నారు.