
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా కాకతీయ యూనివర్సిటీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంపౌండ్ కూడా నిర్మించలేకపోయిందని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి . హనుమకొండలో పర్యటించిన మంత్రి కాకతీయ యూనివర్సిటీ కాంపౌడ్ వాల్ కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యా, వైద్యరంగానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత వర్సిటీలో అడుగుపెట్టిన మంత్రులం తామే అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మార్చి 11వ తేదీ సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 75రోజుల్లోనే 31వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు . TSPSCని పునరుద్దరించి ఉద్యోగ నోటీఫికేషన్లు ఇస్తున్నామని చెప్పారు.