బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త బెదిరిస్తుండు

ఇంటి పక్కన స్థలాన్ని వదిలిపెట్టాలని లేకపోతే చంపేస్తానని అధికార పార్టీ కౌన్సిలర్ భర్త బెదిరిస్తున్నాడని ఓ యువతి ఆరోపించింది. బెల్లంపల్లి పట్టణానికి చెందిన 16వ వార్డులో నివాసం ఉంటున్న ఓ యువతిని వార్డు కౌన్సిలర్ ఎలిగేటి సుజాత భర్త శ్రీనివాస్ గత కొంతకాలంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంబీఏ, గోల్డ్ మెడలిస్టైన తాను కాకతీయ యూనివర్సిటీలో బీఈడీ చదువుతూ ప్రైవేటు కాలేజీ లెక్చరర్ గా పని చేస్తోంది. తల్లి, బిడ్డతో కలిసి జీవిస్తున్న తన ఇంటిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు.. దీనిపై 15 సార్లు పీఎస్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది.

ఇప్పటికే తనపై రెండుసార్లు దౌర్జన్యం చేశారని బాధితురాలుఆరోపిస్తోంది.గురువారం మరోసారి కౌన్సిలర్ ఎలిగేటి సుజాత కొందరితో కలిసి దాడి చేశారని తెలిపింది. కన్నాల శివారులోని 60 నెంబర్ లో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా ఎవరూ పట్టించుకోలేదని, కానీ నాలుగడుగులు లేని తన ఇంటి స్థలంలో మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అధికారులు, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది.