‘క్రూ’ తర్వాత కరీనా కపూర్ (Kareena Kapoor) నటించిన లేటెస్ట్ మూవీ ‘ది బకింగ్‌హమ్ మర్డర్స్ (The Buckingham Murders). హన్సల్ మెహతా (Hansal Mehta) ఈ ఇంటెన్స్ థ్రిల్లర్‌కు దర్శకుడు. ఏక్తాకపూర్, శోభా కపూర్ నిర్మించిన ఈ చిత్రానికి కరీనా కపూర్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.
ఇంగ్లాండ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రిమోట్ కమ్యూనిటీలో జరిగిన మర్డర్ కేసును ఛేదించే డిటెక్టివ్ కాప్‌గా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్‌లో కరీనా కపూర్ నటించింది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ సహా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.
ఇకపోతే.. ఈ మూవీ సెప్టెంబర్ 14న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సుమారు రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.15 కోట్లు మాత్రమే వచ్చాయి. అలాంటి మూవీ ఇప్పుడు నవంబర్ 8 నుంచి ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. ఈ సినిమాకు IMDB లో 7.1/10 రేటింగ్ తో ముందంజలో ఉన్న.. కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది.
Also Read:-నాగ చైతన్య - శోభిత మ్యారేజ్ డేట్ ఫిక్స్!
కథేంటంటే::
బ్రిటీష్ ఇండియన్ డిటెక్టివ్ జస్మీత్ భామ్రా అకా జాస్ (కరీనా కపూర్ ఖాన్) అనే ఓ డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది. బకింగ్‌హామ్ షైర్ ప్రాంతంలో ఓ పిల్లాడు హత్యకు గురవుతాడు. అది కూడా పిల్లల దినోత్సవం అయిన నవంబరు 14న. దీంతో ఇండో-బ్రిటీష్ డిటెక్టివ్ తన పరిశోధన మొదలుపెడుతుంది. ఐదుగురిని అనుమానిస్తుంది. ఇంతకీ ఆ పిల్లాడ్ని ఎవరు చంపారు? చివరకు ఏమైందనేదే స్టోరీ.
తన కొడుకును కోల్పోయిన బాధలో ఉన్న జస్మీత్ భామ్రా.. తన ఊరు వదిలి వెళ్లి మరో చోట ఓ పదేళ్ల పిల్లవాడి హత్య కేసును పరిష్కరించే పనిలో ఉంటూ ఆ హత్యకు గల అసలు కారణం ఎలా కనుగొన్నది? అతన్ని చంపింది ఎవరు? అనే అంశాలతో ఈ మూవీ ఇంటెన్స్ యాంగిల్ లో తెరకెక్కింది.