ఢిల్లీలో జ్ఞాన్‌సింగ్ అనే పోలీసుపై ఓ ఎద్దు దాడి చేసింది. దయాల్పూర్ లోని షేర్పూర్ చౌక్లో రాత్రి సమయంలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తుండగా అటుగా రోడ్డుపై నడుచుకుంటూ వచ్చింది ఎద్దు. దీన్ని గమనించకుండానే రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నాడు జ్ఞాన్‌సింగ్. పక్కకు వెళ్లినట్టే వెళ్లి పోలీస్ పై అకస్మాత్తుగా వెనుక నుంచి కొమ్ములతో కుమ్మేసింది. దీంతో కానిస్టేబుల్ గాల్లో ఎగురుతూ కింద పడ్డాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని వార్తల కోసం