రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డ అమెజాన్, ఫ్లిప్కార్ట్.. ఫేక్ ISI మార్క్తో దందా.. 3500 ఐటమ్స్ సీజ్..!

రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డ అమెజాన్, ఫ్లిప్కార్ట్.. ఫేక్ ISI మార్క్తో దందా.. 3500 ఐటమ్స్ సీజ్..!

ఒకటి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన సంస్థ.. అమెజాన్.. మరోటి ఇండియా లీడింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్. ఇండియన్ ఆన్ లైన్ మార్కెట్ ను శాసిస్తున్న ఈ రెండూ కలిసి కస్టమర్స్ ను ఘోరంగా బురిడీ కొట్టిస్తున్నాయి. కోట్లాది మంది నమ్మకంతో ఆన్ లైన్ లో బుకింగ్స్ చేసుకుంటుంటే సొమ్ము చేసుకుంటున్న ఇ-కామర్స్ సంస్థలు ఫేక్ ఐఎస్ఐ మార్క్ తో విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. ఎన్నాళ్లుగా ఈ దందా సాగుతుందో తెలియదు కానీ.. ఎట్టకేలకు పోలీసులకైతే చిక్కారు. 

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఢిల్లీ బ్రాంచ్ అధికారులు Amazon, Flipkart మోసాలను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. శనివారం (మార్చి 29) మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు 15 గంటల పాటు అమెజాన్ వేర్ హౌజ్ ప్రైవేట్ లిమిటెడ్ లలో తనిఖీలు చేసి వేల సంఖ్యలో ఫేక్ ప్రొడక్ట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం.. గీజర్స్, మిక్సర్స్ తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులకు ఈఎస్ఐ మార్క్ లేకుండా యాధేచ్ఛగా దందా చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు 70 లక్షల రూపాయల విలువైన వస్తువులను అధికారులు సీజ్ చేశారు. 

తగిన చర్యలు తీసుకుంటాం: అమెజాన్

తమ ఇ-కామర్స్ వెబ్ సైట్ లో లిస్ట్ చేసుకున్న వ్యాపారులు నియమ నిబంధనలకు అనుగుణంగా అమ్మకాలు జరపాలని మా గైడ్ లైన్స్ లో ఉంటుంది. ఒకవేళ ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటాం’’ అని అమెజాన్ ఇండియా స్పోక్స్ పర్సన్ ప్రకటించారు. 

ఫ్లిప్ కార్ట్ వేర్ హౌజ్ లో కూడా ఇదే పరిస్థితి:

ఒకవైపు అమెజాన్ వేర్ హౌజ్ పై దాడులు చేస్తున్న సమయంలోనే ఢిల్లీ త్రినగర్ లో మరో టీమ్  ఫ్లిప్ కార్ట్ కు సంబంధించిన ఇన్ స్టా కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌజ్ పై దాడులు చేసింది. ఫుట్ వేర్, ఇతర ప్యాక్ చేసి డెలివరీకి రెడీగా ఉన్న ఐటమ్స్ ను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. సరైన ISI మార్క్ లేకుండా ఫేక్ నంబర్స్ తో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 590 జతల ఫుట్ వేర్ ను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుంది. 

గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా BIS వరుస దాడులు నిర్వహిస్తోంది. గత వారంలో తమిళనాడు తిరువళ్లూ్ర్ జిల్లాలో నిర్వహించిన దాడులలోనూ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వేర్ హౌజ్ లలో 3,376 ఐటమ్స్ ను సీజ్ చేశారు అధికారులు.