కేటీఆర్‌ను ఆహ్వానించిన గంగుల
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో మానేరు వాగుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 17న ఓపెనింగ్ చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ కు హాజరుకావాలని మంత్రి కేటీఆర్ ను గంగుల శుక్రవారం సిరిసిల్లలో కలిసి ఆహ్వానించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవిశంకర్, జడ్పీ చైర్ పర్సన్ విజయ, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.